క్రిస్మస్ వేడుకల్లో మెదక్ చర్చిని సందర్శించిన తెలంగాణ గవర్నర్

మెదక్ చర్చిని సందర్శించిన తెలంగాణ గవర్నర్
  • మెదక్ చర్చిని సందర్శించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.
  • 100 ఏళ్ల చరిత్ర కలిగిన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు.
  • కలెక్టరేట్ సందర్శన తర్వాత చర్చిలో పాల్గొన్న గవర్నర్.

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని 100 ఏండ్ల చరిత్ర కలిగిన చర్చిని ఆదివారం సందర్శించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు.

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం క్రిస్మస్ వేడుకల సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రాన్ని సందర్శించారు. మొదట కలెక్టరేట్‌ను సందర్శించిన గవర్నర్‌కు కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

తర్వాత 100 ఏళ్ల చరిత్ర కలిగిన మెదక్ చర్చిని సందర్శించిన గవర్నర్‌కు చర్చి కమిటీ సభ్యులు పుష్పగుచ్చం అందజేశారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, చర్చిలోని విఐపీ రిజిష్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా చర్చి గురువులు గవర్నర్‌ను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆర్డీవో రమాదేవి, ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు, చర్చి సభ్యులు గంట సంపత్, శాంసన్ సందీప్, జాయ్ ముర్రే తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment