10న తెలంగాణ క్యాబినెట్ భేటీ
తెలంగాణ క్యాబినెట్ ఈనెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వ పథకాలపై చర్చించే అవకాశం ఉంది. అటు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే