ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
నిజామాబాద్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 4
ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో నూతన హెడ్మాస్టర్ సాయన్నకు హెచ్ ఆర్ సి కమిటీ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర, 50డివిజన్ ఇంచార్జ్ ధర్మారం నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 50వ డివిజన్ ఇన్చార్జి ధర్మారం అవిన్ మాట్లాడుతూ.. గురువును మించిన దైవం లేదని మనం ప్రతి ఒక్కరం ఒక స్థాయిలో వస్తున్నామంటే గురువు ఆశీర్వాద ఫలితమే అని ప్రతి విద్యార్థి తల్లిదండ్రితో పాటు గురువును గౌరవించాలని.గురువు ఒక మంచి మార్గ దిశా నిర్దేశమని అన్నారు. గురువును ఎప్పుడు మరువరాదని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఉపాధ్యాయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్. హెచ్.ఆర్.సి జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నగర కార్యదర్శి చింత కింద సంతోష్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.