నాడు ఆత్మహత్యాయత్నం.. నేడు టీచర్
ఏలూరు, సెప్టెంబర్ 21 (M4News):
గతేడాది మే 23న ఏలూరులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను శక్తి టీం సిబ్బంది కాపాడి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ ఘటన తర్వాత కొత్త ఉత్సాహంతో ముందుకు సాగిన ఆమె ఇటీవల DSC పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి టీచర్ ఉద్యోగం పొందారు.
ఆదివారం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. “మీ ప్రోత్సాహం, కౌన్సెలింగ్ వల్లనే నేను తిరిగి జీవితం వైపు అడుగులు వేశాను. ఈరోజు ఉపాధ్యాయురాలిని కావడం మీరందించిన ఆత్మస్థైర్య ఫలితం” అని పేర్కొన్నారు.