ఆగస్టు 15 లోపు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ఆగస్టు 15 లోపు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ఆగస్టు 15 లోపు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

పిఆర్టియు టిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బివి రమణారావు

ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 28

ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆగస్టు 15వ తేదీ లోపు పరిష్కరించాలని పి ఆర్ టి యు టీఎస్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బివి రమణారావు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ముధోల్ మండలంలోని మచ్కల్-రాంటెక్-ముధోల్లోని బాలుర బాలికల, గురుకుల పాఠశాలలో సంఘ సభ్యత్వాన్ని నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సంఘం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనిఅన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆగస్టు 15 లోపు పరిష్కరించుకుంటే సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ వచ్చే సెప్టెంబర్ 1 వ తేదీ రోజు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నామని పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరుకావాలని కోరారు. ఉపాధ్యాయుల యొక్క GPF TSGLIF , సరెండర్ బిల్లులు రెండు సంవత్సరాలు గడుస్తున్న పెండింగ్లో పెట్టడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ప్రతినెల 700 కోట్లు విడుదల చేయకుండా గత నెల 182 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నదని అన్నారు వెంటనే ఈ నెలలో 1218 కోట్లు విడుదల చేసి బకాయిలు చెల్లించాలని కోరారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వెళ్లిన ఉపాధ్యాయులు వైద్య బిల్లులు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని వెంటనే బే షరతుగా అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలలో వర్తించే విధంగా హెల్త్ కార్డు మంజూరు చేయాలని అన్నారు. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనాలు చెల్లించే విధంగా, పాఠశాలల సమయసారిని మార్చే విధంగా ప్రభుత్వానికి సంఘం ప్రాతినిధ్యం చేసిందన్నారు. కేజీబీవీ పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయడానికి రాష్ట్ర సంఘం ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసింది అన్నారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇప్పించడానికి ఆర్థిక శాఖకు ప్రాతినిధ్యం చేశామని, త్వరలో ఉత్తర్వులు వస్తాయని అన్నారు. నూతన PRC ని 50% ఫిట్మెంట్తో 2023 సంవత్సరం జూలై నుంచి అమలయేటట్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని అన్నారు . ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కే. గంగాధర్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.శ్రీనివాసరావు జిల్లా ఉపాధ్యక్షులు పి రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షులు పి. ప్రవీణ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఆహద్, మండల మహిళ ఉపాధ్యక్షులు కే. యోగిత , అర్షాద్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వసంతరావు , గీత ,నర్సింగ్ రావు, శ్రీనివాస్ తదితర ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment