ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియ సమస్యలకు కారణం కాకూడదు
తపస్న జిల్లా ఇంచార్జ్ గోనెల శశిరాజ్
కుంటాల మనోరంజని ప్రతినిధి ఆగస్టు 2
విద్యాశాఖలో ఇటీవల చేపట్టిన సర్దుబాటు ప్రక్రియలో విద్యాశాఖ అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు సంఘాల నాయకుల జోక్యం కారణంగా హడావుడిగా సర్దుబాటు ప్రక్రియను చేపట్టడం జిల్లాలోని ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని తపస్ జిల్లా ఇంచార్జ్ గోనెల శశిరాజ్ అన్నారు. కుంటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య పెరిగి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న పాఠశాలలు ప్రమాణాలు లేని సర్దుబాటు లో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, కొన్ని పాఠశాలలు తమ అనుకూలత కోసం తప్పుడు సంఖ్యను సదరు అధికారులకు సమర్పించి తప్పుదోవ పట్టించారని దీనివల్ల విద్యార్థుల సంఖ్య కి అనుగుణంగా ఉన్న ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు నష్టపోయి విద్యా వ్యవస్థ తిరోగమనం పొందే అవకాశం ఉందని కావున జిల్లా అధికారులు సరైన విచారణ చేపట్టి సమస్యను పరిష్కరించి విద్యావ్యవస్థపై నమ్మకాన్ని కలిగించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్ కుమార్, సుదర్శన్, జిల్లా గౌరవ అధ్యక్షులు జి రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులు చంద్రప్రకాష్ జైస్వాల్, నవీన్ గౌడ్ లు, తదితరులు పాల్గొన్నారు