- శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు విభాగ స్థాయి (జోనల్ స్థాయి) ఖేల్ కూద్ పోటీలలో మెరుపులు.
- అనేక కేటగిరీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు.
- రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక.
శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, విభాగ స్థాయి ఖేల్ కూద్ పోటీలలో ప్రతిభ కనబరిచి అనేక కేటగిరీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. వీరంతా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీల్లో గెలుపొందిన వారికి పాఠశాల సభ్యులు అభినందనలు తెలిపారు.
భైంసా, జనవరి 5: శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆదిలాబాద్ విభాగ్ స్థాయి (జోనల్ స్థాయి) ఖేల్ కూద్ పోటీలలో అద్భుత ప్రదర్శనను కనబరిచారు. ఈ పోటీలలో శిశు, బాల, కిశోర వర్గాలలో పాల్గొని అనేక కేటగిరీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. వీరు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
పోటీల్లో గెలుపొందిన విద్యార్థులలో శిశువర్గ నుంచి ప్రథమ స్థానాన్ని సాధించిన ఎ. సాత్విక (400 మీ. పరుగు), బాలవర్గం నుంచి ఆర్. యోగిత (100 మీ., 600 మీ. పరుగు), కిశోరవర్గం నుంచి ఎస్. అనిత (800 మీ., 1500 మీ. పరుగు) ముఖ్యంగా ప్రథమ స్థానాలను సాధించారు.
ఈ విజయంతో పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చారు. తద్వారా ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారు ప్రాంత స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి క్షేత్ర స్థాయికి ఎంపిక కావాలని పాఠశాల అధికారులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పాఠశాల సభ్యులు, ముఖ్యంగా ప్రధానాచార్యులు, ప్రబంధకారిణి, అకడమిక్ ఇంచార్జీ, ఆచార్యులు, విద్యార్థులు గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.