వినాయక నిమజ్జనం లో తగు జాగ్రత్తలు తీసుకోండి

వినాయక నిమజ్జనం లో తగు జాగ్రత్తలు తీసుకోండి

వినాయక నిమజ్జనం లో తగు జాగ్రత్తలు తీసుకోండి

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి. సెప్టెంబర్ 5

జిల్లాలోని అన్ని గ్రామల ప్రజలు వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటులు చేయాలని అధికారులను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోశాధికారి భీమారం మండల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కాసిపేట రవి మాట్లాడుతూ భక్తులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ గణనాధుడిని పూజించి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసేందుకు చెరువులు కుంటలు వాగులు వద్దకు వస్తారని పేర్కొన్నారు. ఈ నేపాధ్యంలో ఏవైనా ప్రమాదాలు కానీ ప్రాణహని కానీ జరిగే ప్రమాదం ఉండొద్దని చెరువుల వద్ద తగినంత లైట్లు ఏర్పాటు చేయాలని ఇతరత్రా అవసరమైన జాగ్రత్త తీసుకోవాలని అధికారులను కోరారు, భక్తులు కూడా భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లపై విగ్రహాలను తరలించేటప్పుడు జాగ్రత్తగాఉండాలని ప్రత్యేకంగా కరెంటు తీగలను గమనిస్తూ పలు జాగ్రత్తలు పాటించాలని ఇందుకు అధికారులకు సహకరించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment