కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

ముధోల్ : అక్టోబర్ 21

రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో ఐకేపీ-పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. క్వింటాల్ A గ్రేడ్ వరి రకం ధాన్యానికి రూ.2320, B గ్రేడ్ క్వింటాల్ వరి రకం ధాన్యానికి రూ.2300 ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు.

రైతులు ప్రైవేటు వ్యాపారుల దగ్గరకు వెళ్లి నష్టపోకుండా, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీకాంత్, పిఏసీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ అంబేకర్ సాయిరాం, మాజీ జడ్పిటిసి లక్ష్మినర్సా గౌడ్, పిఎసిఎస్ సురేందర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, మాజీ సర్పంచ్ నిమ్మ పోతన్న, దాతత్రి, సీఈఓ సాయి రెడ్డి, మాజీఉప సర్పంచ్ ఉదయ్ కుమార్, నాయకులు ధర్మపురి శ్రీనివాస్, సాయినాథ్, భూమన్న, రాంచదర్ రెడ్డి, ప్రభాకర్ సుధాకర్, భూమేష్ గంగాధర్, ఏఓ, ఏఈఓ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment