వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ఎమ్4 ప్రతినిధి ముధోల్

 

 

రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం ముధోల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని చించాల-వెంకటాపూర్- విట్టోలి- బొరేగాం-వడ్తాల-చింతకుంట-కారేగాం గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్యెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం రైతుల అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. రైతులు తమ పంట ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తే వారికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉంటుంది అన్నారు. అందువల్ల ప్రతి రైతు తమ పంట ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ ఛైర్మన్ తీగల వెంకటేష్ గౌడ్, బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పాటిల్, ముధోల్ పిఏసీఎస్ డైరెక్టర్ సుదర్శన్, ముధోల్ తహసీల్దార్ శ్రీకాంత్, మాజీ జెడ్పిటిసి లు లక్ష్మి నర్సాగౌడ్, సావ్లి రమేష్, బిజెపి ముధోల్ మండల అధ్యక్షుడు కోరి పోతన్న, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రోళ్ల రమేష్, నాయకులు ధర్మపురి శ్రీనివాస్, కదం సంతోష్, లడ్డు పోతన్న, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపిటిసిలు, రైతులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment