నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోండి
నిర్మల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 26
జిల్లా కేంద్రంలోని స్థానిక బేస్తవారిపేట లో ఉన్న కురుక్షేత్ర పాఠశాల- వాగ్దేవి పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడపబడుతున్నాయి.
పాఠశాల భవనాలు సరిగా లేకపోవడం, రేకుల షెడ్డులో తరగతి గదులు నిర్వహించడం పాఠశాల భవనం పక్కన డిజె సౌండ్ తో పిల్లలకు ఇబ్బందులు కలగడం, ఒకే చోట డీజే దుకాణ సముదాయాలు, పాఠశాల తరగతి గదులు ఇవి రెండూ ఒకే చోట ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో పాఠశాల భవనము ఎప్పుడు కూలిపోతుందో తెలియక విద్యార్థుల పడుతున్న అవస్థలు వర్ణణాతీతం . కావున వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్మల్ జిల్లా ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులు డిమాండ్ చేశారు