నిర్మల్, 3 September
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన యూపీఐ వినియోగదారులకు కీలక సూచన చేసింది. సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా సెప్టెంబరు 4న తెల్లవారుజామున 12.15 గంటల నుంచి 1 గంట వరకు సుమారు 45 నిమిషాల పాటు ఎస్బీఐ యూపీఐ సేవలకు అంతరాయం కలగనున్నట్లు సమాచారం.
🔥 SBI UPI వినియోగదారులకు అలర్ట్ సెప్టెంబరు 4న 45 నిమిషాల పాటు యూపీఐ సేవలకు అంతరాయం హైదరాబాద్, సెప్టెంబరు 3 ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) యూపీఐ వినియోగదారులకు కీలక సూచన చేసింది. సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా సెప్టెంబరు 4న తెల్లవారుజామున 12.15 గంటల నుంచి 1 గంట వరకు సుమారు 45 నిమిషాల పాటు ఎస్బీఐ యూపీఐ సేవలకు అంతరాయం కలగనున్నట్లు సమాచారం. ఈ సమయంలో గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, యోనో తదితర యాప్‌ల ద్వారా ఎస్బీఐ ఖాతా నుంచి చేసే యూపీఐ లావాదేవీలు విఫలమయ్యే అవకాశం ఉంది. అయితే యూపీఐ లైట్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని బ్యాంకు తెలిపినట్లు పేర్కొన్నారు. యూపీఐ లైట్ ద్వారా చిన్న మొత్తాల చెల్లింపులను పిన్ అవసరం లేకుండా చేసుకునే అవకాశం ఉందని వినియోగదారులకు సూచించారు. అత్యవసర లావాదేవీలు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.











