పెద్ద రామ మందిరంలో స్వామీజీ ఆశీర్వచనాలు
మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్, నవంబర్ 16:
నిజామాబాద్ నగరంలోని పెద్ద రామ మందిరంలో ఈరోజు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయోధ్యపురివాసి, శ్రీ విష్ణుప్రియ పుత్ర శ్రీ ప్రేమ్ నారాయణ మహారాజ్ నగర పర్యటనలో భాగంగా భక్తుల పిలుపుమేరకు పెద్ద రామ మందిరాన్ని సందర్శించారు. స్వామీజీ ఆలయానికి చేరుకున్న వెంటనే శ్రీరామ భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ ధర్మం, భక్తి, సేవల ప్రాముఖ్యతపై ఉపన్యాసం చేశారు. స్వామీజీ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్శన కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యాలయ విద్యార్థులు, ప్రిన్సిపాల్–కరస్పాండెంట్ సముద్రాల శ్రీనివాస్, సముద్రాల మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తి భావంతో మార్మోగింది.