తెలంగాణలో 150 మంది ఏఈవోలపై సస్పెన్షన్ వేటు

M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 22

 

  • డిజిటల్ క్రాఫ్ట్ సర్వేకు వ్యతిరేకంగా ఏఈవోల నిరసనలు
  • ప్రభుత్వం 150 మందికి పైగా ఏఈవోలపై సస్పెన్షన్ వేటు
  • యూనియన్లు పెట్టినా, ప్రభుత్వం చెప్పిన పని చేయకపోతే వేటు తప్పదంటూ హెచ్చరిక

 డిజిటల్ క్రాఫ్ట్ సర్వేకు వ్యతిరేకంగా తెలంగాణలో ఏఈవోలు (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు) తమ నిరసనలు వ్యక్తం చేయగా, ప్రభుత్వం 150 మందికి పైగా ఏఈవోలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం క్రమశిక్షణ చర్యల పేరుతో ఈ నిర్ణయం తీసుకుంది.

 తెలంగాణలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను వ్యతిరేకిస్తున్న ఏఈవోలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దాదాపు 150 మందికి పైగా ఏఈవోలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. యూనియన్లు పెట్టినప్పటికీ, డిజిటల్ క్రాఫ్ట్ సర్వే నిర్వహించడానికి నిరాకరించిన ఏఈవోలను ప్రభుత్వం తమ దారికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఏఈవోలు శంషాబాద్ లో సమావేశమై తమ నిరసన వ్యక్తం చేస్తూ, తగిన భద్రత, సహాయకులను అందిస్తేనే డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడానికి సిద్ధమని ప్రకటించారు.

Leave a Comment