నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

కాఠ్మండూ: ‘జెన్ జెడ్’ యువత ఆందోళనలతో అట్టుడికిన నేపాల్‌ లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి శుక్రవారం రాత్రి 8.45 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నేపాల్ ఆర్మీ, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్‌తో ‘జెన్ జెడ్’ ప్రతినిధులు సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్లమెంటును రద్దు చేసి, కర్మిని తాత్కాలిక ప్రధానిగా నియమించాలంటూ ‘జెన్ జెడ్’ ప్రతినిధులు డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు ఈ ప్రతిపాదనకు అంతా అంగీకారం తెలిపారు. దీంతో 73 ఏళ్ల సుశీల కర్కి తాత్కాలిక పభుత్వ అధిపతిగా నియమితులు కానున్నారు.

ఎవరీ సుశీల కర్కి

కర్కి 1971లో బిరాట్‌నగర్‌లో అడ్వకేట్‌గా లీగల్ కెరీర్ ప్రారంభించారు. క్రమంగా పలు పదోన్నతులు పొందుతూ 2009లో సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. 2016లో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. అవినీతి అంశాల్లో రాజీలేని ధోరణి ప్రదర్శిస్తారనే గుర్తింపును పొందారు. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్సెస్‌లో ఆమె మాస్టర్ డిగ్రీ పొందారు. నేపాల్‌లోని త్రిభువన్ యూనివర్శిటీలో న్యాయశాస్త్ర పట్టా (బ్యాచిలర్ డిగ్రీ) పొందారు.

Join WhatsApp

Join Now

Leave a Comment