సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పోలీస్ నాఖాబంది కార్యక్రమం
సూర్యాపేట జిల్లా ఎస్‌పీ కె. నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో, ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా 23 ప్రదేశాలలో ఏకకాలంలో పోలీస్ నాఖాబంది నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు వస్తూ వెళ్ళే ప్రధాన మార్గాలు, సరిహద్దు ప్రాంతాలను కవర్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు కొనసాగింది. ముఖ్యంగా అక్రమ రవాణా, గంజాయి, నిషేధిత పదార్థాల రవాణా, రౌడీషీటర్స్ కదలికలు, పశు అక్రమ రవాణా మరియు అంతర్రాష్ట్ర/అంతర్ జిల్లా నేరస్తుల కదలికలను గుర్తించి నివారించడం లక్ష్యంగా తీసుకున్న చర్యలలో భాగం.
నాఖాబంది నిర్వహించిన ముఖ్య ప్రాంతాలు:
-
సూర్యాపేట రూరల్: టేకుమట్ల (ఖమ్మం హైవే), పెనపహడ్-మాచారం
-
సూర్యాపేట టౌన్: కెసారం రోడ్ పాత ఎస్పీ ఆఫీస్, చివ్వేంల రోడ్ బీబిగుడెం
-
నాగారం సర్కిల్: తిరుమలగిరి, వెలిశాల, అర్వపల్లి జంక్షన్
-
తుంగతుర్తి సర్కిల్: పసునూరు శివారు, మద్దిరాల-కుంటిపల్లి, నూతనకల్-బిక్కుమల్ల
-
మునగాల సర్కిల్: కూడలి (కాకరవాయి), మామిల్లగూడెం, సిరిపురం
-
కోదాడ రూరల్ సర్కిల్: అనంతగిరి-శాంతినగర్, రామాపురం X రోడ్, దొండపాడు, పులిచింతల ప్రాజెక్ట్
-
కోదాడ టౌన్ సర్కిల్: హుజూర్నగర్ ఫ్లైఓవర్, ఖమ్మం X రోడ్
-
హుజూర్నగర్ సర్కిల్: వేపల సింగారం, మట్టపల్లి బ్రిడ్జి, చిల్లేపల్లి బ్రిడ్జి, జనపహడ్ దామరచర్ల రోడ్
ప్రత్యేక సమీక్ష:
టేకుమట్ల వద్ద నాఖాబంది సమయంలో సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పెన్నపహాడ్ ఎస్సై శ్రీకాంత్, సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్, ఆర్ఎస్ఐ అశోక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్‌పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు, ఈ విధమైన ఎఫెక్టివ్, విజిబుల్ పోలీస్ింగ్ పద్ధతులు ప్రజలకు భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యం.