- రజినీకాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిక.
- చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
- రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
- కార్డియాలజిస్టుల వైద్య పర్యవేక్షణలో రజినీకాంత్.
- హెల్త్ బులెటిన్ త్వరలో విడుదల.
: సూపర్‌స్టార్ రజినీకాంత్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి అనారోగ్యానికి గురైన రజినీకాంత్ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఆస్పత్రి వర్గాలు త్వరలోనే రజినీకాంత్ ఆరోగ్యంపై అధికారిక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేయనున్నాయి.
: సూపర్‌స్టార్ రజినీకాంత్ అనారోగ్యానికి గురై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వర్గాలు ఆయనను కార్డియాలజీ విభాగంలో చేర్చి, ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
రజినీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. రజినీకాంత్‌కు ముఖ్యంగా గుండె సమస్యల గురించి పరిక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యంపై అధికారిక హెల్త్ బులెటిన్‌ను కాసేపట్లో విడుదల చేయనున్నారు.
రజినీకాంత్ అభిమానులు అతని ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి వద్దకు చేరిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.