బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం మద్దతు తెలిపిన సుంకే ప్రభాకర్*

*బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం మద్దతు తెలిపిన సుంకే ప్రభాకర్*

మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 18

బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం మద్దతు తెలిపిన సుంకే ప్రభాకర్*

మాదిగ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో బిసి రిజర్వేషన్ కొరకు సంపూర్ణ మద్దతు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సుంకే ప్రభాకర్ మండిపడ్డారు. నిర్మల్ జిల్లా ఆర్టీసీ బస్సు డిపో కేంద్రానికి తెల్లవారుజామున నాలుగు గంటలకే చేరుకొని సంపూర్ణ మద్దతు ఇచ్చి బిసి రిజర్వేషన్ అమలుకు మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేసి అనంతరం కిరాణా,పెట్రోల్ బాంక్ వివిధ రకాల వ్యాపారస్తుల యజమానులకు 42 శాతం బీసీ రిజర్వేషన్ హక్కులను వారికి వివరించి దుకాణాలు బందు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కత్తి విష్ణు, ప్రధాన కార్యదర్శి దాసరి శివ, మామడ మండల అధ్యక్షులు చిట్యాల వినోద్, బీసీ సంఘం నాయకులు పొన్నం నారాయణ గౌడ్, భాస్కర్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు రవీందర్, దివ్యాంగుల ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు సట్టి సాయన్న ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment