వేసవి సెలవుల పుస్తకావిష్కరణ మహోత్సవం

వేసవి సెలవుల పుస్తకావిష్కరణ మహోత్సవం

వేసవి సెలవుల పుస్తకావిష్కరణ మహోత్సవం

నిజామాబాద్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 21

నగరంలోని బోర్గం వద్ద గణపతి దేవాలయంలో చింతల శ్రీనివాస్ గుప్త రచించిన వేసవి సెలవుల పుస్తకావిష్కరణ. జిల్లా విద్యాధికారి వార్షి అశోక్ కుమార్ చేతుల మీదుగా కొనసాగింది.. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన బాల కవుల సమ్మేళనంతో పాటు పుస్తకావిష్కరణ గావించారు. నిర్వహణ అధికారి కాసర్ల నరేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చింతల శ్రీనివాస్ గుప్తా ఎన్నో పుస్తకాలు రచించారని అందులో భిన్నంగా.. వేసవి సెలవులు.. ఏ విద్యార్థులకైతే సెలవులు సెలవుల్లోని జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయని.. ఆ మధురామృతమే ఈ పుస్తకంలో ఇమిడి ఉందని.. ఇంత మహత్కార్యాన్ని చేసిన చింతల శ్రీనివాస్ గుప్తా మరియు వారి దంపతులకు ప్రత్యేక శ్రీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని నేను మనసారా కోరుతున్నానని.. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి పుస్తకావిష్కరణ గావించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కాసర్ల నరేష్ కుమార్. ఈ కార్యక్రమంలో కవులతో పాటు రచయితలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment