బాసర గోదావరిలో ఆత్మహత్యాయత్నం – గంగపుత్ర సాయిలు ధైర్యవంతమైన రక్షణ
నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి తీరం వద్ద ఘటన
మనోరంజని తెలుగు టైమ్స్ బాసర ప్రతినిధి అక్టోబర్ 26
నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో నేడు ఉదయం జరిగిన ఓ ఆత్మహత్యాయత్నం స్థానికులను కుదిపేసింది. నిజాంబాద్ జిల్లా దుబ్బగల్లికి చెందిన ఓ యువకుడు, కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకాడు.
ఆ ఘటనను గమనించిన బాసర గంగపుత్ర కర్రీ సాయిలు తక్షణమే స్పందించి ప్రాణాలను సాహసోపేతంగా కాపాడారు. సాయిలు చూపిన ధైర్యానికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. బాధిత యువకుడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.