లోకేష్‌కు వారసత్వం – చంద్రబాబు క్లారిటీ !

లోకేష్‌కు వారసత్వం – చంద్రబాబు క్లారిటీ !

లోకేష్‌కు వారసత్వం – చంద్రబాబు క్లారిటీ !

లోకేష్‌కు రాజకీయ వారసత్వం అప్పగిస్తున్నారా అనే అంశంపై జరుగుతున్న చర్చకు చంద్రబాబు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. దావోస్‌లో ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్యూలో రాహుల్ కన్వాల్ .. లోకేష్ విషయంలో అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో అయినా మరో రంగంలో అయినా వారసత్వం అనేది ఓ భ్రమ అని..అయితే ఇతరులతో పోలిస్తే వారికి కొన్ని అవకాశాలు వస్తాయని.. అనుకూలతలు ఉంటాయన్నారు. వారు సమర్థంగా పని చేస్తే.. ఉంటారు లేకపోతే లేరన్నట్లుగా సమాధానం ఇచ్చారు.

లోకేష్ విషయంలో ఆయనకు ఉన్న సానుకూలతల ప్రకారం అవకాశాలు దక్కించుకున్నారు కానీ ప్రతిభను నిరూపించుకుని ముందుకెళ్లాల్సింది లోకేషేనని.. వారసత్వాన్ని అందుకుంటారా లేదా అన్నది ఆయన ప్రతిభ మీద ఆధారపడి ఉంటుందని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు చెప్పిన మాటల్లో చాలా వకూ స్పష్టత ఉంది. సినిమా వాళ్ల పిల్లలకు సినిమాల్లోకి రావడానికి కొన్ని అనుకూలతలు ఉంటాయి. కానీ నిలబడాలంటే వారి ప్రతిభ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటివి చాలా రుజువు అయ్యాయి. వ్యాపారంలో అయినా… రాజకీయాల్లో అయినా ఇదే చాలా సార్లు నిరూపితమయింది.

నారా లోకేష్‌కు చంద్రబాబు కుమారుడిగా కొన్ని అవకాశాలు వస్తాయి. అనుకూలతలు ఉంటాయి. కానీ సమర్థంగా రాజకీయం చేయకపోతే అయన అయినా తెరమరుగు కావాల్సిందే. లోకేష్ తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కొని పాదయాత్రతో పార్టీని నిలబెట్టి.. కార్యకర్తల సంక్షేమం కోసం వినూత్నంగా ఆలోచించి.. సమర్థతను నిరూపించుకుంటున్నారు. ఆయన భవిష్యత్ నాయకుడ్నని అందరితో అనిపించుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఇదే చెబుతున్నారని అనుకోవచ్చు

Join WhatsApp

Join Now

Leave a Comment