కమ్మర్పల్లి లో ఎస్.జి.ఎఫ్ జోనల్ క్రీడల ఎంపికలు విజయవంతంగా నిర్వహణ
అండర్ 14, 17 విభాగాల్లో వాలీబాల్, కబడ్డీ క్రీడాకారుల ఎంపిక –
ప్రతిభావంతులైన విద్యార్థుల గుర్తింపు
మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి నవంబర్ 01
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఎస్.జి.ఎఫ్ (School Games Federation) ఆధ్వర్యంలో జోనల్ స్థాయి క్రీడల ఎంపికలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అండర్ 14 విభాగంలో వాలీబాల్ (బాయ్స్ & గర్ల్స్), అండర్ 17 విభాగంలో కబడ్డీ (బాయ్స్ & గర్ల్స్) క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపిక కార్యక్రమాన్ని జోనల్ కన్వీనర్ పి. సాయన్న ప్రారంభించారు. ఈ సెలక్షన్ ప్రక్రియను జోనల్ సెక్రటరీ మరియు స్థానిక పి డి వేముల నాగభూషణం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి తదుపరి స్థాయిలో ప్రాతినిధ్యం వహించేలా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్, ఎర్గట్ల మరియు కమ్మర్పల్లి మండలాల పి డి లు మరియు పి.ఈ. టి లు – ఆనంద్, శ్యామ్, నాగేష్, మాధురి, గోపాల్, జ్యోతి, రమేష్ గౌడ్, బాలు, సంజీవ్, ప్రేమ్ కుమార్, నాగేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
నిర్వాహకులు మాట్లాడుతూ, “గ్రామీణ స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం, రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడం ఎస్.జి.ఎఫ్ లక్ష్యం” అని తెలిపారు.