సంస్కృతి జ్ఞాన పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ
మనోరంజని ప్రతినిధి
ముధోల్ : ఫిబ్రవరి 05
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు విద్యా భారతి శిక్షా సంస్థాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతి జ్ఞాన పరీక్షల్లో ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సంస్కృతి జ్ఞాన పరీక్షల్లో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థులకు విద్యా భారతి శిక్ష సంస్థాన్ వారు ప్రశంసా పత్రాలను అందించారు. సందర్భంగా ప్రధానాచార్యులు సారధి రాజు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యతను సాధించాలని పేర్కొన్నారు. బుద్ధి వికాసానికి వివిధ రకాల నైపుణ్యాల ప్రదర్శన దోహదపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రబంధకారిణి సభ్యులు, ఆచార్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు