నూతన ఏ టీ సీ (ఐటిఐ) కాలేజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

నూతన ఏ టీ సీ (ఐటిఐ) కాలేజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

నూతన ఏ టీ సీ (ఐటిఐ) కాలేజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రపంచ స్థాయి నైపుణ్యం తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ని అందిచడం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నీ ప్రారంభించడం జరిగింది.
నస్పూర్ కేంద్రంగా నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ వారి ఆధ్వర్యం లో వాల్ స్టిక్కర్ నీ భీమారం మండల కేంద్రంలో బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు కొక్కుల నరేష్ ఆవిష్కరణ చేశారు. యువత ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా భీమారం మండల కేంద్రానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నీ మంజూరు చేయాలని చెన్నూరు శాసనసభ్యులు, కార్మిక , పరిశ్రమల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ని ప్రత్యేకంగా కోరుతామన్నారు. అదేవిధంగా అత్యాధునిక మిషనరీ తో ప్రత్యక్ష అనుభవం ఉన్న ఉపాధ్యాయులచే బోధించబడుతుంది అదేవిధంగా 100% ఉద్యోగ అవకాశాలు ప్లేస్మెంట్లలో సహాయం కూడా చేయడం జరుగుతుందని ఈ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నామని నిర్వాహకులు అన్నారు. దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ సత్యానంద్ తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment