-విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి

-విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి

-విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి

-చదువుతోనే జీవితానికి సార్థకత ఏర్పడుతుంది

-విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి

-ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు,ఫిబ్రవరి 2 : మనోరంజని

-విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి

కరీంనగర్ కోట ఇన్స్టిట్యూట్స్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవాన్ని రామడుగు మండలం దేశరాజుపల్లి వద్ద గల వసుధ కన్వెన్షన్ లో నిర్వహించారుకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడిపల్లి సత్యం విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు.విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలి.చదువుతోనే సార్థకత ఏర్పడుతుంది, కడు పేదరికంలో ఉన్న వ్యక్తులను కూడా సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దే శక్తి ఒక్క చదువుకే ఉంది.ఎక్కడో చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన ఏపీజే అబ్దుల్ కలాం కష్టపడి చదువుకొని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా, దేశ రాష్ట్రపతిగా ఎదిగారు.ఇంటర్మీడియట్ అనేది రంగుల ప్రపంచం, విద్యార్థులు రంగుల ప్రపంచానికి ఆకర్షితులు కాకుండా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి.సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదిగి, కన్నవారికి, ఉన్న ఊరికి, చదువుకున్న కళాశాలకు పేరు తీసుకురావాలి.ఎలాంటి లాభాపైక్ష లేకుండా, విద్యార్థులకు తనవంతుగా ఉత్తమ విద్యను అందజేయాలన్న సంకల్పంతో కరీంనగర్ పట్టణంలో కళాశాలను స్థాపించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్న కళాశాల చైర్మన్ అంజిరెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.భవిష్యత్తులో కళాశాల మరింత అభివృద్ధి పథంలో నిలిచి మరింత మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని ఆకాంక్షిస్తున్నాము.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అంజిరెడ్డి, ప్రిన్సిపల్ సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జవ్వాజి హరీష్, మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment