విజ్ఞాన శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాలి

విజ్ఞాన శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాలి

విజ్ఞాన శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాలి
విద్యార్థులను భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి

మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 18 -నిర్మల్ అర్బన్ మండలంలోని జుమ్మెరాత్‌పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ వినియోగంపై రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) శ్రీ పి. రామారావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి కలిగించడానికి, వారిని భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు మంజూరు చేసినట్టు తెలిపారు.ఈ ప్రయోగశాలల కోసం జిల్లాలోని 17 పీఎం శ్రీ పాఠశాలలకు దాదాపు రూ. 25 లక్షల విలువైన సాంకేతిక పరికరాలు – లాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, శాస్త్రీయ సామాగ్రి అందినట్లు తెలిపారు. శిక్షణ తరగతులకు రాష్ట్ర స్థాయి నుండి కోఆర్డినేటర్లు రావడం జరిగిందని, వారు ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారని చెప్పారు.నిర్మల్, ఖానాపూర్ డివిజన్‌లకు చెందిన 11 పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్మల్‌లో, బైంసా డివిజన్‌లోని 6 పాఠశాలల ఉపాధ్యాయులకు బైంసాలోని దేగాం పాఠశాలలో శిక్షణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పాఠశాల నుండి భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, గణితం బోధించే ముగ్గురు ఉపాధ్యాయులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు.నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు జరుగుతున్నాయని, ఉపాధ్యాయులు విజ్ఞాన శాస్త్ర సాంకేతికతను తమకు నూర్చుకుని విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనల్ని ప్రోత్సహించాలన్నారు. విద్యార్థుల సమస్య పరిష్కార సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్తలు నర్సయ్య, ప్రవీణ్ కుమార్, సైన్స్ అధికారి వినోద్ కుమార్, శిక్షణ నిపుణులు కళ్యాణ్ రెడ్డి, పవన్ నిరంజన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిబాబు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment