నిజామాబాద్ నారాయణ స్కూల్‌లో ప్రతిభావంతుల విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్

నిజామాబాద్ నారాయణ స్కూల్‌లో ప్రతిభావంతుల విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్

సుభాష్ నగర్ బ్రాంచ్‌లో విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తెచ్చిన స్ఫూర్తిదాయక కార్యక్రమం –

ముఖ్యఅతిథులుగా ఎం.ఇ.ఓ వెంకట్ గౌడ్, ఏజీఎం శివాజీ

మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 30

నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్‌లో గల నారాయణ పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థుల ఆధ్వర్యంలో “స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ చందన మాట్లాడుతూ, విద్యార్థుల విద్యా ప్రతిభను వెలికితీయడానికి, వారి నేర్చుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. గత ఆరు నెలలుగా విద్యార్థుల అభ్యాసంలో వచ్చిన మార్పులు, వారి ప్రగతిని అంచనా వేయడంలో ఈ కాన్ఫరెన్స్ ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం.ఇ.ఓ వెంకట్ గౌడ్ మరియు ఏజీఎం శివాజీ హాజరయ్యారు. విద్యార్థుల ప్రదర్శనను వీరు ప్రశంసిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మరియు ఆత్మవిశ్వాసం పెంచుతాయని తెలిపారు. కార్యక్రమాన్ని ప్రధాన డీఎల్ఎం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించగా, చివరగా ప్రిన్సిపల్ చందన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, అధ్యాపకులు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment