టాలెంట్ టెస్టులో విద్యార్థిని గంగా ఉత్తమ ప్రతిభ
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల( బాలికల)లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని కే. గంగ మండల స్థాయి గణిత బాలికల టాలెంట్ పరీక్షలు మొదటి స్థానం సంపాదించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీత, మండల విద్యాధికారి రమణారెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అమీర్ కుశ్రు, గణిత ఉపాధ్యాయురాలు పి.కవిత, ఉపాధ్యాయురాలు స్వర్ణలత, అంజుమ్ పర్వీన్, కొక్కుల గంగాధర్, షాహిద్ పర్వీన్, నీరజ, కవిత యాదవ్, ప్రత్యేకంగా అభినందించారు.