🔹 ఇసుక అక్రమ రవాణా పై కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
🔹 డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగం ఏర్పాటు
🔹 అక్రమ మైనింగ్, ఇసుక రవాణా కు వాడిన వాహనాలు సీజ్ చేసి వేలం
🔹 మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయంతో కఠిన చర్యలు
నాగర్ కర్నూల్ జిల్లాలో అక్రమ మైనింగ్ మరియు ఇసుక రవాణాపై జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ మైనింగ్ పై డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగం ఏర్పాటు చేయనున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేసి వేలం వేస్తామని తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో అక్రమ మైనింగ్ మరియు ఇసుక దందాలపై జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఉక్కుపాదం మోపనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్రమ మైనింగ్, ఇసుక రవాణా పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ చర్యలలో భాగంగా డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో సమన్వయం చేయడం ద్వారా అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అక్రమంగా ఇసుక రవాణా చేసేవారి వాహనాలను సీజ్ చేసి, వాటిని వేలం వేయనున్నట్లు ప్రకటించారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ లేదా ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.