నేర చరిత ఉన్న రియాజ్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
జోర్పూర్ గ్రామ యువకుల ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి పై కొవ్వొత్తుల ర్యాలీ
నందిపేట్: నేర చరిత ఉన్న రియాజ్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జోర్పూర్ గ్రామ యువకులు డిమాండ్ చేశారు. నందిపేట్ మండలంలోని జోర్పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం కానిస్టేబుల్ ప్రమోద్ మృతి పట్ల సంతాపం తెలియజేసి, అనంతరం ఆనంది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ బీఆర్‌ఎస్ నాయకుడు రాము మాట్లాడుతూ, “పోలీసు వాన్ని చూడకుండానే కత్తితో దాడి చేయడం రియాజ్ నేరప్రవృత్తిని స్పష్టంగా చూపిస్తుంది” అని అన్నారు. జిల్లాలో ఇలాంటి నేరచరిత్ర కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారని, వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యువత గంజాయి మత్తులో తార్కికత కోల్పోతుందని, ఇటీవలి కాలంలో జరిగిన అనేక సంఘటనలు కూడా అదే దిశగా సాగుతున్నాయని తెలిపారు.
నిందితుడు రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని తెలిసిందని, ఒకవేళ చేయకపోతే వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని యువకులు గట్టిగా కోరారు. ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, ఆయన కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తామని గ్రామ ప్రజలు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జోర్పూర్ గ్రామ యువత, బీఆర్‌ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు, ఆనంది యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.