సరస్వతీ నగర్లో వెలుగని వీధి దీపాలు

సరస్వతీ నగర్లో వెలుగని వీధి దీపాలు

సరస్వతీ నగర్లో వెలుగని వీధి దీపాలు

పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి

ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 17

ముధోల్ మండలం ముద్గల్ గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన సరస్వతీ నగర్లో వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు వాపోయారు. గత 20 రోజుల నుండి వీధి దీపాలు వెలగకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు పేర్కొన్నారు. సమస్యను పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గ్రామపంచాయతీలో నిధులు లేవని పంచాయతీ కార్యదర్శి పేర్కొంటున్నారని తెలిపారు. రాత్రి సమయాల్లో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ప్రజలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అనుబంధ గ్రామమైన సరస్వతి నగర్ లో వీధి దీపాలను అమర్చి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment