కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు!

కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు!

కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు!

మనోరంజని ప్రతినిధి  హైదరాబాద్:జూలై 28

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాల్లోని అర్హులను గుర్తించిన ప్రభుత్వం.. వారికి కొత్త కార్డులు పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టింది. తాజా.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే అమలు చేస్తున్న వివిధ గ్యారంటీలను కొత్త రేషన్ కార్డుదారులకు కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా పంపిణీ చేస్తున్న రేషన్ కార్డుదారు లకు ప్రభుత్వం పథకాలు అందించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది.

ప్రతి పథకంతోపాటు ఆరోగ్యశ్రీ కింద చికిత్సకు కూడా రేషన్ కార్డు తప్పని సరి కావడంతో కొత్తగా కార్డులు పొందుతున్న వారికి ప్రభుత్వ పథకాలు అందేలా యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వం రెడీ చేస్తుంది, రాష్ట్రంలో ఇంతకుముందు 9.10లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండగా.. 2.84కోట్ల మంది వివిధ స్కీమ్ ల కింద లబ్ధిదారు లుగా ఉన్నారు.

అయితే, ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్తగా 3.50లక్షల కుపైగా రేషన్ కార్డులు మంజూరు చేసింది. మొత్తంగా ఏడు లక్షల కుటుంబాలకు కొత్తగా కార్డులు ఇవ్వనుంది. వీటికింద దాదాపు 30లక్షల మందికిపైగా లబ్ధిదారులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వీళ్లందరికీ ప్రభుత్వం గ్యారంటీలు, ఆరోగ్యశ్రీ అందేలా రేషన్ కార్డులతో అనుసంధానించనున్నారు.

కొత్త రేషన్ కార్డుదారులం దరికీ ప్రభుత్వ పథకాలు అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మీ, చేయూ త తదితర పథకాలకోసం వీళ్ల నుంచి దరఖాస్తులను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తం గా స్పెషల్ డ్రైవ్ నిర్వహిం చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అధికారులే నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వాళ్ల వివరాలను నమోదు చేయనున్నారు.

తద్వారా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కొత్తగా రేషన్ కార్డులు పొందినోళ్లు ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనాలను పొందడంలో ఎలాంటి జాప్యం లేకుండా చూసేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇప్పటికే స్పెషల్ సెల్ ఏర్పాటు చేసింది. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ సేవలు సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటుంది

Join WhatsApp

Join Now

Leave a Comment