ఇళ్లు, ఆఫీసుల్లోనే ఉండండి.. బయటకు రావొద్దు : హైదరాబాద్ సిటీ పోలీసులు..!!

ఇళ్లు, ఆఫీసుల్లోనే ఉండండి.. బయటకు రావొద్దు : హైదరాబాద్ సిటీ పోలీసులు..!!

ఇళ్లు, ఆఫీసుల్లోనే ఉండండి.. బయటకు రావొద్దు : హైదరాబాద్ సిటీ పోలీసులు..!!

హైదరాబాద్ లో ఎన్నడూ లేనంత వాన కురుస్తోంది. ఆకాశం నుంచి నీళ్లు కుమ్మరిస్తున్నట్లు.. మేఘాలకు చిల్లు పడినట్లు నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. కుమ్యులో నింబస్ మేఘాలతో రాజధాని ప్రాంతం అంతా చీకట్లు కమ్ముకున్నట్లు వాతావరణం మారిపోయింది.

వాటర్ ఫాల్స్ దగ్గర ఎంత నీటి ధార ఉంటుందో అంత ఎత్తున నీళ్లను కుమ్మరిస్తోంది ఆకాశం. దీంతో నగరంలో వీధులన్నీ జలమయం అయ్యాయి. భారీ వరద కారణంగారోడ్లు వాగులు, నదులను తలపిస్తున్నాయి.

సోమవారం (ఆగస్టు 04) మధ్యాహ్నం తర్వాత మొదలైన వాన ఆగకుండా కంటిన్యూగా కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి దూరంలో ఉన్న వాహనాలు, బిల్డింగులు కూడా కనిపించే పరిస్థితి లేదు. నాలాలు పొంగుతున్నాయి. పట్టగలే సాయంత్రం అయినట్లుగా మారిపోయింది పరిస్థితి. దీంతో పోలీసులు వాహనదారులకు, హైదరాబాదీలకు సూచనలు చేశారు.

భారీ వర్షం కురుస్తుండటంతో ఇళ్లల్లో ఉన్నవాళ్లు బయటికి వెళ్లవద్దని సూచించారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అదే విధంగా ఆఫీసుల్లో ఉన్న వాళ్లు వర్షం నిలిచే వరకు బయల్దేరవద్దని హెచ్చరించారు. భారీగా వరద పారుతుండటంతో రోడ్లపైన వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారీగా ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉండటంతో వర్షం కాస్త రిలీఫ్ ఇచ్చిన తర్వాతే బయలు దేరాలని సూచించారు పోలీసులు.

సిటీ మొత్తానికి ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే చాన్స్ ఉందని.. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని సూచించారు. నగరవాసులు ఏదైనా ప్రదామానికి గురైతే 100 కు డయల్ చేయాలని సూచించారు. డయల్ హండ్రెడ్ ను వినియోగించుకోవాలని సూచించారు

Join WhatsApp

Join Now

Leave a Comment