- ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్‌షీర్ ప్రారంభం
- P15B డిస్ట్రాయర్, P17A స్టెల్త్ ఫ్రిగేట్, P75 జలాంతర్గామితో నావికాదళ శక్తి పెంపు
- ప్రధాని మోదీ: “భారత్ గ్లోబల్ సముద్ర శక్తిగా ఎదుగుతోంది”
- Made-in-India యుద్ధనౌకలు, 75% స్వదేశీ భాగస్వామ్యం
ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యాధునిక యుద్ధనౌకలు INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్‌షీర్‌ను జాతికి అంకితం చేశారు. ఈ మూడు నౌకలు భారత నావికాదళ శక్తిని పెంచడంలో కీలకంగా ఉండనున్నాయి. Made-in-Indiaగా అభివృద్ధి చేయబడిన ఈ నౌకలు, 75% స్వదేశీ భాగస్వామ్యంతో నిర్మాణం పొందాయి.
న్యూ ఢిల్లీ, జనవరి 15:
భారత నావికాదళం తన శక్తిని మరింతగా పెంచుకుంటూ సముద్ర భద్రతలో కొత్త అధ్యాయాన్ని రాశింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో అత్యాధునిక యుద్ధనౌకలు INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్‌షీర్‌ను జాతికి అంకితం చేశారు.
అత్యాధునిక నౌకల విశేషాలు
-
INS సూరత్: ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ఆధునిక గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్‌గా పేరుగాంచిన INS సూరత్ పీ15బీ ప్రాజెక్ట్‌లో భాగంగా అభివృద్ధి చేయబడింది. దీని స్వదేశీ భాగస్వామ్యం 75% కావడం గర్వకారణం.
-
INS నీలగిరి: P17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్‌లో తొలి నౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్ టెక్నాలజీ దీని ప్రత్యేకత.
-
INS వాఘ్‌షీర్: ఫ్రాన్స్‌తో భాగస్వామ్యంలో రూపొందించిన ఈ ఆరు జలాంతర్గాములలో చివరిది. ఇది సముద్రంలో నిఘాకు కీలకం.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, “భారతదేశం సముద్ర భద్రతలో విశ్వసనీయ భాగస్వామిగా గుర్తింపు పొందుతోంది. ఈ మూడు యుద్ధనౌకలు ‘మేడ్ ఇన్ ఇండియా’గా ఉండటం గర్వకారణం” అని అన్నారు.