హైదరాబాద్, 27 July
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు తీపికబురు అందింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ రేషన్ డీలర్లు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ రేషన్ డీలర్లు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
దీంతో పౌరసరఫరాల శాఖ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. సుమారు 64.80 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీకి విడుదల చేసినట్లు సమాచారం. గోదాముల నుంచి బియ్యాన్ని వెంటనే రేషన్ దుకాణాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. ప్రణాళిక ప్రకారం ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ జరిగే అవకాశం ఉంది.












