నిర్మల్, జులై 22
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో వెనుకబడిన జిల్లాలు పనులను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు. జిల్లాల వారీగా డిజిటలైజేషన్ పురోగతిని సమీక్షించిన ఆయన, వారంలోగా అన్ని జిల్లాలు 90 శాతం పురోగతి సాధించాలని, వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారంలో ఆధార్ సంఖ్య నమోదు ఐచ్చికమే తప్ప తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా కలెక్టర్లు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.











