మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
షాద్నగర్ పట్టణంలో రోడ్ల ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని, జీతాలు తీసుకుంటూ పని చేయకుండా కార్యాలయాల్లో కూర్చోవడం సరికాదని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ రావు అన్నారు. చౌరస్తా విస్తరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
షాద్నగర్ పట్టణంలో రోడ్ల ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని, జీతాలు తీసుకుంటూ పని చేయకుండా కార్యాలయాల్లో కూర్చోవడం సరికాదని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ రావు అన్నారు.
షాద్నగర్ మున్సిపల్ కార్యాలయంలో చౌరస్తా విస్తరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోడ్లను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చౌరస్తా విస్తరణ కోసం విగ్రహాలను తరలించేందుకు సమావేశాలు పెట్టి కాలయాపన చేయడం కాదని, ముందుగా రోడ్లను ఆక్రమించిన నిర్మాణాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
శాశ్వత నిర్మాణాలైన బుగ్గారెడ్డి భవనం, కోటీశ్వరుల కట్టడాలనే కాకుండా, చిన్న చిన్న వ్యాపారుల దుకాణాలు, డబ్బాలను తొలగించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకుండా, ఎంతటి వారైనా అక్రమంగా ఆక్రమించిన నిర్మాణాలను తొలగించి చౌరస్తా విస్తీర్ణం చేయాలని కోరారు.












