నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంపై ప్రత్యేక అధికారి బాలిగ్ అహ్మద్ అవగాహన కల్పించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చూడాలని అధికారులకు సూచించారు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను పటిష్టం చేసి, ప్రజల సమస్యలను సానుభూతితో విని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబడుతోందని తెలిపారు.
ఈ సమావేశంలో తహశీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, ఎంపీఓ అజీజ్ ఖాన్, ఎంఈఓ మహేందర్, ఏవో వికార్ అమ్మద్, ఆర్డబ్ల్యూఎస్ విష్ణుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ప్రజా పాలన కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించాలని ప్రత్యేక అధికారి సూచించారు.


