రిటైర్మెంట్ అయిన నాలుగు రోజులకే విషాదం.. రిటైర్డ్ ఏఎస్సై గుండెపోటుతో మృతి , జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదవీ విరమణ చేసిన నాలుగు రోజులకే రిటైర్డ్ ఏఎస్సై గుండెపోటుతో మృతి చెందారు. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్1కు చెందిన కె. గంగాధర్ గౌడ్ పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సైగా విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో భాగంగా పోలీస్ శాఖకు సేవలందించిన ఆయన న పదవీ విరమణ చేశారు. అయితే పదవీ విరమణ చేసి నాలుగు రోజులు కూడా గడవకముందే గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులు, బంధువులు, సహచర పోలీసు సిబ్బందిలో తీవ్ర విషాదాన్ని నింపింది. పదవీ విరమణ అనంతరం ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన సమయంలో గంగాధర్ గౌడ్ మృతి చెందడంతో గంగాస్థాన్ ఫేజ్1లో విషాదఛాయలు అలుముకున్నాయి.
రిటైర్మెంట్ అయిన నాలుగు రోజులకే విషాదం..
Share:

సారాంశం
రిటైర్డ్ ఏఎస్సై గుండెపోటుతో మృతి
ముఖ్య విషయాలు
- నగరంలోని గంగాస్థాన్ ఫేజ్1కు చెందిన కె.
- రిటైర్మెంట్ అయిన నాలుగు రోజులకే విషాదం..
- రిటైర్డ్ ఏఎస్సై గుండెపోటుతో మృతి , జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
- పదవీ విరమణ చేసిన నాలుగు రోజులకే రిటైర్డ్ ఏఎస్సై గుండెపోటుతో మృతి చెందారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3309ఆర్టికల్స్
4,07,346వ్యూస్










