ఆదిలాబాద్, ఈ నెల 20
ష్ట్ంలోఎల్నినోప్భంతోఏ్పడే్షభపి్థితలనఎద్కొనేందకంద్తచ్యలపైఉ్డిఆదిలబద్జిల్లంత్ిజూపల్లికృష్ణఈనెల20నక్షని్హించనన్న.ఉట్నూలోజిగేఈేశంలోనలగజిల్లలకలెక్ట్ల,ిిధశఖలఅధికలపల్గొంట.
ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, మద్యనిషేధం & ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 20న ఉట్నూరులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సమీక్షలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎల్నినో ప్రభావం దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, శాఖల సమన్వయం, అత్యవసర కార్యాచరణపై సమగ్రంగా చర్చించనున్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవనం, మార్క్ఫెడ్, సాగునీటి శాఖ, మిషన్ భగీరథ, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ (టీజీఎన్పీడీసీఎల్), అటవీ, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్య, మహిళా-శిశు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొని తమ శాఖల సన్నద్ధతపై వివరాలు సమర్పించనున్నారు.












