Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
శనివారం హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులకు పంటల మార్పిడి విధానాలపై అవగాహన కల్పించి, తక్కువ నీటితో సాగయ్యే పంటల సాగును ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు, ప్రత్యేక అధికారులతో జరిగే సమీక్ష సమావేశాలకు వర్షపాతం, వ్యవసాయం, తాగునీరు, శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలపై పూర్తి నివేదికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, సోమవారం ఉట్నూర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక అధికారి ఇలంబర్తితో జరిగే సమీక్ష సమావేశానికి అన్ని శాఖల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, డీఎంహెచ్వో రాజేందర్, డీపీవో శ్రీనివాస్, ఈఈ (ఆర్డబ్ల్యూఎస్) సందీప్, డీఆర్డీఓ విజయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.












