హైదరాబాద్, 2026-08-03
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంలో అనేక కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. బుకింగ్, డెలివరీ నియమాలతో పాటు వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ల ధరల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ నెల 16 లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిబంధన విధించాయి.
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంలో అనేక కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. బుకింగ్, డెలివరీ నియమాలతో పాటు వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ల ధరల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ నెల 16 లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిబంధన విధించాయి. దీంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
వినియోగదారులకు ఇబ్బందులు
గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడే ఇబ్బందులను తప్పించేందుకు డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్ద ఈ-కేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినా, ఇతర సమస్యలు వినియోగదారులను వెంటాడుతున్నాయి. గ్యాస్ కనెక్షన్ దారు విదేశాల్లో ఉండటం, మరణించడం, వృద్ధుల వేలిముద్రలు పడకపోవడం, ఆధార్, గ్యాస్ వివరాల్లో తేడాలు, ఒకే కుటుంబంలో రెండు కనెక్షన్లు ఉండటం వంటి సమస్యలకు సరైన పరిష్కారం లభించక పోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.
సరఫరా ఒత్తిడి, నకిలీ కనెక్షన్ల తొలగింపు
ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇంధన మార్కెట్‌పై పడటంతో ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోనూ సరఫరా ఆలస్యం, బుకింగ్ డెలివరీ మధ్య తీవ్ర జాప్యం జరిగేది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఎల్పీజీని నిజమైన గృహ వినియోగదారులకే అందించడంతోపాటు బోగస్, డూప్లికేట్, దీర్ఘకాలంగా వినియోగంలో లేని కనెక్షన్లను గుర్తించి తొలగించడంపై చమురు సంస్థలు దృష్టి సారించాయి.
ఈ-కేవైసీ అమలు
వినియోగదారుల ఆధార్, బయోమెట్రిక్ వివరాలను అనుసంధానం చేయడం ద్వారా అసలు లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ-కేవైసీని విస్తృతంగా అమలు చేస్తున్నారు.











