లక్ష్మణ చందా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 24
ోడభవంతకోటెడడవెంకటెడడదేేకకషణచందండంోడబైోడడ,అండౌండడైేజకోసంఅండబఅంజేవకతచే.కోసంఊధయోోడడవెడచేయడంతోటడైేజవయవసథెచఅధకయోచసత.
రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు లక్ష్మణ చందా మండలంలో డబుల్ లైన్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం ఆర్ అండ్ బి ఏఈ అంజనేశ్వర్ కొలతలు చేశారు. ఈ పనుల కోసం ఊరి మధ్యలో రోడ్డు వెడల్పు చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులు యోచిస్తున్నారు.
మంత్రి ఆదేశాల మేరకు ఏఈ అంజనేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని, రోడ్డు వెడల్పునకు అవసరమైన కొలతలను తీసుకున్నారు. డ్రైనేజీ పనులకు సంబంధించిన ప్రణాళికలను కూడా పరిశీలించారు. ఈ పనులు పూర్తయితే మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు, వర్షపు నీటి నిల్వ సమస్య కూడా పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండ్ర నరేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షుడు అజ్గర్, బొజ్జ రవి, మల్లేష్, నగేష్, రవి కల్లెడ, భూమన్న, వెంకటి వినేష్, ఉప సర్పంచ్ రవీందర్, ఆత్మ డైరెక్టర్ కిరణ్ సింగ్ ఠాకూర్, గ్రామస్తులు పాల్గొన్నారు.












