నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సిర్పల్లి 3 తండా నుంచి సిర్పల్లి 1 తండా వరకు నాలుగు కిలోమీటర్ల పొడవున బీటీ రహదారి నిర్మాణానికి రూ.2.84 కోట్లు మంజూరయ్యాయి.
ఈ రహదారి నిర్మాణంతో రెండు తండాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించవచ్చు. వర్షాకాలంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి.
మాజీ ఎమ్మెల్యే బి. నారాయణరావు పటేల్ నాయకత్వంలో ఈ అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. గ్రామ సర్పంచ్ క్రాంతి రాజ్ చౌహాన్ ప్రత్యేక కృషితో రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ బీటీ రహదారి నిర్మాణంతో ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.












