Nirmal/Dasturabad (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ పెరిగి, వరద ప్రవాహం అధికమైంది. ఈ పరిస్థితులపై స్పందించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, భారీ వర్షాన్ని లెక్కచేయకుండా డ్యామ్ వద్దకు చేరుకొని అధికారులతో కలిసి గేట్లు ఎత్తించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు.
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ పెరిగి, వరద ప్రవాహం అధికమైంది. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, భారీ వర్షంలోనే డ్యామ్ వద్దకు చేరుకొని అధికారులతో కలిసి గేట్లు ఎత్తించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, అన్ని శాఖల అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.












