(బి) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో గురువారం కురిసిన భారీ వర్షాలకు ఝరి (బి) గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్లపైకి నీరు చేరడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఝరి (బి) గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించింది. వర్షపు నీరు రోడ్డుపైకి చేరడంతో వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ మహేంద్రనాథ్, ఎంపీడీవో శ్రీధర్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాగు దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని గ్రామస్థులకు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి మినహా బయటకు రావద్దని, వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాగు ఇరువైపులా రక్షణ ఏర్పాట్లు చేపట్టి, ప్రజలు వాగు దాటకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని అధికారులు ఆదేశించారు. ఈ పరిశీలనలో అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.












