బాసర, జూన్ 28
భైంసా మండలంలోని గుండెగాం గ్రామ ముంపు సమస్య, హైకోర్టు స్టే కారణంగా నిలిచిపోయిన 800 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 20 ఏళ్ల క్రితం నిర్మించిన 1000 ఇళ్ల బేస్మెంట్ల సమస్యలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
భైంసా మండలంలోని పాల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపునకు గురైన గుండెగాం గ్రామ సమస్యను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. బాసర పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, త్వరలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా భైంసా పట్టణంలో హైకోర్టు స్టే కారణంగా నిలిచిపోయిన సుమారు 800 ఇందిరమ్మ ఇళ్ల అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
భైంసా పట్టణ బైపాస్ రోడ్డుకు ఇరువైపులా సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన దాదాపు 1000 ఇళ్ల బేస్మెంట్ల సమస్యపై కూడా చర్చించారు. వాటిలో కొన్ని బేస్మెంట్లు దెబ్బతినగా, మరికొన్ని పూర్తిగా కూలిపోయిన నేపథ్యంలో అప్పటి లబ్ధిదారులకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు.
ఈ అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చినట్లు తెలిపారు.












