భైంసా, జూన్ 28
బైంసా డివిజన్లో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదివారం మీడియా ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. సమాజ సేవలో భాగస్వాములవుతున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరారు.
బైంసా డివిజన్లో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు మీడియా మిత్రులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ సమాజ సేవలో భాగస్వాములవుతున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సొంత ఇంటి స్థలం లేని మీడియా ప్రతినిధులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు కేటాయించడం ద్వారా వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు సమస్యను సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు మీడియా ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బైంసా డివిజన్‌కు చెందిన పలువురు జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.












