భైంసా, 2026-06-28
భైంసా విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మత్తు పనుల కారణంగా సోమవారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ అంతరాయం పలు ప్రాంతాలతో పాటు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు వర్తిస్తుంది.
33 కేవీ భైంసా విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మత్తు పనుల కారణంగా రేపు (సోమవారం) 29-06-2026న ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఈ విద్యుత్ అంతరాయం భైంసా ఉపకేంద్ర పరిధిలోని రాహుల్ నగర్, బస్టాండ్ ప్రాంతం, పూలేనగర్, నిర్మల్ రోడ్ ప్రాంతం, సంతోషిమత నగర్, రాజీవ్ నగర్, ఓవైసీ నగర్, మదీనా కాలనీ, పిప్రీ కాలనీతో పాటు మిర్జాపూర్, సిద్దూర్, లింగా-1, లింగా-2, టక్లీ, కత్గామ్, హజ్గుల్, మాటేగామ్, ఎక్కగాం, క్రెషర్ ప్రాంతాలు మరియు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు వర్తిస్తుందని పేర్కొన్నారు.
వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.











