కుబీర్, ఆగస్టు 01
గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. శనివారం కుభీర్, కుంటాల మండలాల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా సర్పంచులకు అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. శనివారం కుభీర్, కుంటాల మండలాల్లో మండల ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాజకీయాలకు అతీతంగా సర్పంచులు తనకు ఏ అవసరమున్నా తెలియజేయాలని, సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో పేరు సంపాదించాలని ఆయన చెప్పారు. సమావేశంలో అధికారులు శాఖలవారీగా తమ ప్రగతి నివేదికలు చదివి వినిపించారు.
సర్పంచులు చెప్పిన సమస్యలను 45 రోజుల్లో పూర్తి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల్లో మహిళా సమైక్య భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడి భవనాలు, సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాలని, నిధులు మంజూరు చేస్తే పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉందన్నారు.
అదేవిధంగా, పోడు భూముల్లో పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. సమావేశంలో శాఖలవారీగా జరుగుతున్న ప్రగతిని అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.












